
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన `జై చిరంజీవ` సినిమా గురించి పరిచయాలు అవసరం లేదు. 2006 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో సమీరా రెడ్డి, భూమిక హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో శ్రియా శర్మ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు. ఇప్పుడు శ్రీయ శర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా అందరి మనసులు దోచుకున్న శ్రియా శర్మకు అప్పుడే 23 ఏళ్లు వచ్చేశాయి. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా ఎప్పుడో తెలుగు తెరకు పరిచయమైనా... గుర్తింపు వచ్చింది దూకుడులో సుశాంతిగానే.
ఆ తర్వాత గాయకుడు సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత నిర్మలా కాన్వెంట్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు
రోషన్ సరసన నటించి మెప్పించింది. ఇక తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు నటించిన శ్రియా శర్మ హీరోయిన్గా బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా శ్రియా శర్మ హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.