రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న కలిసి నటీంచిన సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా ఎందుకో ఆడియెన్స్ కు సినిమా ఎక్కలేదు. తెలుగులో ఈ సినిమా దిజాస్టర్ కాగా హింది డబ్బింగ్ వర్షన్ మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది.

 

అప్పటికే గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్, రష్మిక కాంబో నటించడంతో డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దర్శకుడు ఈ సినిమాతో ఓ మంచి కథ చెప్పాలని అనుకోగా దాన్ని తెరకెక్కించడంలో కొంత కన్ ఫ్యూజ్ అయ్యాడు. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడ్డది. డియర్ కామ్రేడ్ సినిమా హింది డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో 1.6 మిలియన్ లైక్స్ సాధించింది. వ్యూస్ లో కూడా ఈ సినిమా 130 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 

 

తెలుగులో హిట్టైన సినిమాలకే కాదు ఫ్లాపైన సినిమాలకు కూడా హిందిలో క్రేజ్ ఏర్పడుతుంది. అక్కడ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో అదరగొడతాయి. వాటి దారిలోనే ఇక్కడ ప్రేక్షకులు మెచ్చని డియర్ కామ్రేడ్ సినిమా బాలీవుడ్ ఆడియెన్స్ కు మాత్రం నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అవడంతో విజయ్ కు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ గా రీమేక్ కాగా ఆ సినిమా హిట్టైనా ఒరిజినల్ వర్షన్ చేసిన విజయ్ దేవరకొండకు బాగా క్రేజ్ వచ్చింది. మరి డబ్బింగ్ వర్షన్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ పూరి సినిమాతో డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నాడు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: