ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల హవా ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. కేవలం హీరోలుగా సినిమాలు  చేయడమే కాదు.   తమలోని నటుణ్ణి నిరూపించుకునేందుకు వచ్చిన విభిన్నమైన పాత్రలను కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే ఎంతోమంది యువ హీరోలు అటు హీరోలుగా రాణించడంతో పాటు... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న యువ హీరో కార్తికేయ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు గ్యాంగ్ లీడర్ లో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. ఇక అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. పలు సినిమాల్లో ఎన్నో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. 

 

 అయితే తాజాగా నవీన్ చంద్ర  మరో కీలక పాత్రలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నవీన్ చంద్ర సంప్రదించారట చిత్రబృందం. ఇక బాలకృష్ణ లాంటి స్టార్ హీరో కావడం... బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా కావడం    వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ పాత్ర కోసం నవీన్ చంద్ర కూడా ఓకే చెప్పేశారుట.

 

 ఈ మధ్యకాలంలో యువ హీరోలు నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికే నవీన్ చంద్ర కూడా పలు సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి  తన నటనతో మెప్పించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నవీన్ చంద్ర ఓ నెగిటివ్ పాత్రలో నటించబోతోన్నట్లు  తెలుస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో జగపతి బాబు కొడుకుగా  నెగెటివ్ రోల్ లో నటించి అదరగొట్టాడు నవీన్ చంద్ర. మరి బాలయ్య బోయపాటి సినిమా లో ఎలాంటి పాత్ర పోషించ బోతున్నాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: