మహేశ్ బాబు బరిలోకి దిగకుండానే సంచలనాలు సృష్టిస్తున్నాడు. చిన్న ఎనౌన్స్ మెంట్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఒక్కసారి కమిట్ అయితే సోషల్ మీడియాలో సునామి మొదలవుతుంది అన్నట్టు సర్కారు వారి పాటకి క్రేజీ స్టెప్పులేయిస్తున్నాడు ప్రిన్స్. 

 

మహేశ్ బాబు సర్కారు వారి పాట ప్రీలుక్ రిలీజ్ అవ్వడం ఆలస్యం.. సోషల్ మీడియాలో సందడి మొదలైంది. మహేశ్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. మహేశ్ మాస్ లుక్ కు ఇంప్రెస్ అయిన అభిమానులు సర్కారు ప్రీలుక్ కి తెగ లైకులు కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో నానా హంగామా చేశారు. దీంతో మోస్ట్ ప్రీలుక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ప్రీలుక్. 

 

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు బ్యాంక్ స్కామ్స్ బ్యాక్ డ్రాప్ తో చేస్తోన్న సినిమా సర్కారు వారి పాట. సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జి.ఎమ్.బి, ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఈ ప్రీలుక్ ని రిలీజ్ చేశారు నిర్మాతలు. 

 

సర్కారు వారి పాట ప్రీలుక్ కే ఇంత రెస్పాన్స్ వస్తుంటే.. ఫస్ట్ రిలీజ్ అయితే సంచలనం అవుతుందేమో అని లెక్కలేస్తున్నారు సినీజనాలు. ఇక ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చాక ఈ మూవీ లాంచింగ్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

 

అయితే టెక్నికల్ టీమ్ మొత్తాన్ని రివీల్ చేసిన మేకర్స్, ఈ మూవీలో మహేశ్ పక్కన హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఎనౌన్స్ చేయలేదు. మరి ఈ మూవీలో మహేశ్ కు జోడీగా ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి. మహేశ్ కు జోడీగా ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఊహాలోకంలో మునిగి తేలుతున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: