![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/hebba-patel-latest-photos-goes-on-viral0411927a-15e2-4501-852b-1582c5e91c11-415x250.jpg)
హెబ్బా పటేల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అలా ఎలా? అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హెబ్బా పటేల్.. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన `కుమారి 21ఎఫ్` సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో కుర్రకారు హృదయాల్లో హెబ్బా చిన్నపాటి అలజడినే రేపింది.
ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. కానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం, వరుసగా అపజయాలు చవిచూడటంతో హీరోయిన్‌గా నిలదొక్కులేకపోయింది.
అయినప్పటికీ ఈ బ్యూటికి యూత్‌లో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం అడపాదడపాగా గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆహా యాప్‌లోని మస్తీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించి బాగా ఆకట్టుకుంది.
ఇక అదే సమయంలో హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మతిపోగొట్టేస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌లో ఈ భామ అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తోంది. ఇక తాజాగా మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను హెబ్బా షేర్ చేయడంతో.. నెట్టింట్లో అవి వైరల్‌గా మారాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.