టాలీవుడ్ లో ఒకప్పుడు అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది.. ఎంత టాలెంట్ ఉన్నా లక్ కలిసి వస్తేనే గాని ఛాన్సులు వచ్చేవి. ఒక్కటంటే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటూ కృష్ణానగర్ వీధుల్లో తిరిగే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఇప్పటికి అక్కడ అవకాశాలు కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం వాళ్లకేమన్నా ఛాన్సులు వస్తున్నాయా అని అడగొచ్చు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం సినిమాలే కాదు షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ లంటూ టాలెంట్ ఉన్న వాళ్లకు ఎలాగోలా అవకాశాలు వస్తున్నాయి.

 

నిజమైన ప్రతిభ కలిగి.. నటించాలనో, డైరెక్ట్ చేయాలనో, ఏ క్రాఫ్ట్ లో రాణించాలని అనుకున్న వాడైనా సరే చేస్తే సినిమానే చేయాలని అనుకోడు తనకు వచ్చిన ఏ ఛాన్సైనా సరే చేస్తేస్తాడు. ఇక ప్రస్తుతం ఓటిటిల ట్రెండ్ నడుస్తుండగా ఈమధ్య వెబ్ సీరీస్ ల కోసం కథల కొరత ఏర్పడిందని టాక్. అదేంటి కృష్ణానగర్ లో గల్లి గల్లిలో కథ రచయితలు, డైరక్షన్ టాలెంట్ ఉన్న వారు ఉంటారు కదా.. అంటే ఇప్పటికి వాళ్లు అక్కడే ఉన్నారు. ఛాన్సుల కోసం వారి ప్రయత్నాలు మేకర్స్ దాకా వెళ్లలేదని చెప్పొచ్చు.

 

ఈమధ్య ఓటిటి విప్లవం వచ్చిన తర్వాత రైటర్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు కొంతమంది నటీనటులకు కూడా అవకాశాలు వస్తున్నాయి. ఓవిధంగా ఇది మంచి పరిణామమే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో కథలు దొరకడం లేదు అన్న టాక్ ఈమధ్య బాగా వినిపిప్స్తుంది. మరి ఇంకేంటి ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్లు వారి ప్రయత్నాన్ని మరింత వేగం పెంచితే సరైన ఛాన్స్ వారికే రావొచ్చు. ప్రయత్న లోపం లేకుండా ట్రై చేస్తే అద్భుతమైన అవకాశం మన సొంతమే అవుతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: