కేవలం హీరోయిజం వల్లనో.. హీరోయిన్ గ్లామర్ వల్లనో సినిమాలు ఆడేస్తాయా.. అలాంటివి కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్క్ అవుట్ అవుతాయి. అయితే ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా, ఒక డిఫరెంట్ జానర్ సినిమా లేదా ఒక ఎమోషనల్ సినిమా ఇలాంటి హిట్ అయ్యాయంటే కేవలం అందులో నటించిన లీడ్ యాక్టర్స్ మాత్రమే కాదు. క్యారక్టర్ ఆర్టిస్టుల ప్రతిభ కూడా చాలా ఇంప్యాక్ట్ కలిగేలా చేస్తుంది. హీరోలు, హీరోయిన్స్ కు ఉన్న ఇమేజ్ వీళ్లకు లేకపోయినా సరే సినిమాకు క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా బలమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అమ్మ, నాన్న, బాబాయ్, మామయ్య ఒక్కోసారి విలన్ అయినా కూడా అతని పర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తారు. స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపడేలా క్యారక్టర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్లు ఎంత చేసినా సినిమా హిట్ అంటే పేరు వచ్చేది ముందు హీరోకి ఆ తర్వాత దర్శకుడికి. సరైన క్యారక్టర్ కు సరైన ఆర్టిస్ట్ పడితే దర్శకుడు రాసుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది అద్భ్హుతమైన క్యారక్టర్ ఆర్టిస్టులు పనిచేశారు. ఎస్.వి.ఆర్ నుండి రావు రమేష్ వరకు ఎలాంటి పాత్ర అయినా సరే ప్రేక్షకులను మెప్పించేలా చేస్తారు.
కోటా శ్రీనివాస రావు సినిమాలో ఉన్నాడంటే ఆయన చేసేది చిన్న పాత్ర అయినా సరే తన ముద్ర వేసుకుంటాడు. బ్రహ్మానందం కూడా కామెడీ రోల్స్ తో పాటుగ అప్పుడప్పుడు మంచి రోల్స్ చేశారు. ఇక కొంతమంది గుర్తింపు రాని క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వీళ్లు ప్రతి సినిమాల్లో కనిపిస్తారు కాని వాళ్లకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంలో వెనుకపడ్డారు. ఫైనల్ గా సినిమా అంటే కేవలం హీరో, హీరోయిన్ ల రొమాన్స్ కాదు కథకు తగినట్టుగా పాత్రదారులను ఎంపిక చేసుకోవడం దర్శకుడి బాధ్యత అందులో భాగంగానే క్యారక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆడించిన సినిమాలున్నాయ్.. తెలుసా..!