బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండస్ట్రీలో ఎంతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బుల్లితెర నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి వెండితెర వరకు తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎంతో మందిని కలిచి వేసింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖుల పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పెద్దల కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని కొంతమంది బాహాటంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చే వారిని బాలీవుడ్లో ఎదగనివ్వడం లేదు అనే విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్, కరణ్ జోహార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో సుశాంత్ ని ఉద్దేశించి నటి కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . గతంలో సారా అలీ ఖాన్ తో కలిసి కరీనా కపూర్ ఒక టీవీ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్ రాజ్ పుత్ గురించి ఆ కార్యక్రమంలో కరీనాకపూర్ ఎంతో చీప్ గా కామెంట్ చేసింది.
సారా కు నువ్వు ఇచ్చే డేటింగ్ టిప్ ఏమిటి అని కరీనా కపూర్ ను ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత ప్రశ్నించగా... నీ మొదటి హీరోతో మాత్రం డేటింగ్ కి అస్సలు వెళ్ళద్దు అంటూ సారా అలీ ఖాన్ కు చెప్పింది కరీనా కపూర్. అంతేకాదు సుశాంత్ ని చెత్త మొహం అని కూడా విమర్శించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా కరీనా కపూర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు, అసలు కరీనాకపూర్ లో టాలెంట్ లేదని పొగరు ఎక్కువ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు