ప్రయోగాత్మక చిత్రాలకు బాలీవుడ్ పెట్టింది పేరు. అక్కడ ఎప్పుడూ విభిన్నమైన కథలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను అక్కడ ఆదరిస్తారు కూడా. అందుకే అలాంటి సినిమాలు ఏటేటా వస్తూ ఉంటాయి. ఇక తాజాగా లెస్బియన్ కథాంశంతో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా లింగమార్పిడి కథాంశంతోనే ఒక మూవీ తెరకెక్కుతోంది.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ADAH SHARMA' target='_blank' title='adah-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>adah</a> Sharma's reaction to Vidyut Jammwal's 'not just ...


ఆ సినిమానే ‘మ్యాన్ టు మ్యాన్’. ఈ మూవీలో ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నటించిన ఆదా శర్మ నటిస్తోంది. 2008లోనే ‘1920’ సినిమాతో ఆదా శర్మ పరిచయం అయింది. దాదాపుగా దశాబ్దం పైనే సినీరంగంలో రాణిస్తున్న ఈ భామ.. హిందీ.. తెలుగు.. కన్నడ.. తమిళ భాషల్లో నటిస్తోంది. అయితే ‘మ్యాన్ టు మ్యాన్’ చిత్రంతో తన కెరీర్ లోనే మొదటిసారి ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఆదాశర్మ ఈ సినిమాపై హోప్స్ బానే పెట్టుకుంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన ఆదా శర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. అయితే ఈ విషయం తెలియని హీరో హీరో నవీన్ కస్తూరియా అదాను పెళ్ళి చేసుకుంటాడట.

 

IHG'Production of couches ...

 

పెళ్లి తర్వాత ఆమె గురించి తెలుగుకున్న హీరో షాక్ అవుతాడట. లింగమార్పిడి పై మన సమాజంలో ఉన్న చిన్నచూపు వంటి వాటిని చూపిస్తూ ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ దర్శకుడు అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆదాశర్మసినిమా గురించి మాట్లాడుతూ.. “1920” నా మొదటి సినిమా. ఈ సినిమాలో నా పాత్ర చేయడం రిస్క్ అనిపించింది. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం. ‘కమాండో 2’ లో కూడా రిస్క్ ఉన్న పాత్రే చేశానని చెప్తుంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: