రంగు పడుతుంది అంటాడు ఓ సినిమాలో ఏవీఎస్. ఇక బొమ్మ కనబడి దిమ్మతిరుగుతుంది అంటాడు విలన్ తో హీరో. ఇపుడు సినిమా భాషలోనే చెప్పాలంటే బొమ్మ పడుతోంది. ఇంతకాలం మూలన పడిన సినిమా బొమ్మ కనబడుతుందిట. అన్నీ తెరచేశాక సినిమాలకు ఏం అడ్డంకి, ఇమ్యూనిటీ పవర్ ఉన్న వారుంటారు, లేనివారు పోతారు అన్నట్లుగా కరోనా మహమ్మారి కధ సాగుతోంది.

IHG

ఇక లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన  పాలకులు కూడా తమ బాధ్యతను బాగా తగ్గించుకుంటున్నారు. జనాలు కూడా లాక్ డౌన్ తో విసిగిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంటోంది. అయితే ఎవరు విసిగినా మరెవరు అలసిపోయినా కరోనా మహమ్మారి మాత్రం దూకుడుగానే ఉంది. సరే అది అలాగే ఉంటుంది. సహజీవనం మనమే సాగించాలి కాబట్టి తప్పదు అని జనం ఆకలి పోరాటం చేస్తూ రోడ్డు మీదకు వస్తున్నారు.

IHG's IMAX Theatres | LBB, Delhi

దాంతో సినిమా ధియేటర్లు కూడా తెరచేందుకు సన్నాహాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమెరికాలో కరోనా మహమ్మరి వీర విహారం చేస్తున్నా కూడా థియేటర్లను తెరచేస్తున్నారు. జూలై 15 నుంచి అక్కడ సినిమా హాళ్ళు ఓపెన్ అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కరోనా వల్ల కొంత ఇబ్బంది లేదనుకున్న చోట ఇమాక్స్ థియేటర్లు ఓపెన్ చేస్తారని టాక్.

IHG

మొత్తానికి బొమ్మ పడితే చూసేవారు ఎవరు ఉంటారు అన్నది మరో చర్చ. ఇదివరకు మాదిరిగా ఆడియన్స్ వస్తే మాత్రం ఒక్క ఐమాక్సులే కాదు,  కాదు మొత్తం సినిమా థియేటర్ల వ్యవస్థ తెరచేస్తారు. దాంతో మళ్ళీ సందడి మొదలవుతుంది.  మళ్ళీ రీల్ ప్రపంచం  హడావుడి కూడా స్టార్ట్ అవుతుంది. ఆదియన్స్ ని ఈ కరోనా మహమ్మారి బాధల నుంచి ఊహాలోకంలోనికి తీసుకునిపోయే సరికొత్త ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కరణ జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: