అక్కినేని నాగేశ్వరరావు కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత లకు తప్ప ద్వేషం, పగ, ప్రతీకారం వంటి వాటికి అస్సలు చోటు ఉండదు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగార్జున తన తండ్రికి ఎంత గౌరవం ఇస్తాడో అదే స్థాయిలో తన కుమారులకు కూడా గౌరవమిస్తాడు. తన భార్యకి మంచి భర్తగా, కొడుకులకు మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున... నాగచైతన్య సమంత ని పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు నీ ఇష్టం రా అంటూ వెంటనే అంగీకారం తెలిపి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు. తన కోడలు సమంతని తన సొంత అమ్మ లాగా చూసుకుంటాడు నాగార్జున.
1986 నవంబర్ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మి దంపతులకు నాగ చైతన్య జన్మించాడు. అయితే ఏవో కారణాల వలన లక్ష్మి, నాగార్జున పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తదనంతరం నాగార్జున నటీమణి ఐన అమలని వివాహమాడాడు. అయితే ఆ తర్వాత కూడా నాగచైతన్యను ఎంతో ప్రేమగా చూసుకునే వాడు నాగార్జున. పిన్ని అమల కూడా అతడిని సొంత కొడుకులాగా చూసుకునేది.
నాగ చైతన్య డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో తన తండ్రి నాగార్జున వద్దకు వెళ్లి 'నాన్న, నేను నటుడు కావాలనుకుంటాను' అని చెప్పాడు. దాంతో నాగార్జున అతనిని వెంటనే యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. అలాగే డైలాగ్ డెలివరీ, వాయిస్ పై మంచి పట్టు సాధించాలని నాగ చైతన్యకు చెప్పగా, తాను ఒక సంవత్సరం పాటు ప్రత్యేకంగా డైలాగ్ డెలివరీ, వాయిస్ లపై శిక్షణ తీసుకున్నాడు. చైతు విదేశాలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు.
చైతు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకున్న క్షణం నుంచి నాగార్జున అతనికి సహాయం చేస్తూనే ఉన్నాడు. చైతు మొదటి సినిమా జోష్ కి కూడా నాగార్జున ఎంతో కష్టపడి ప్రచారం చేశారు. ఏ మాయ చేసావే సినిమా హిట్ అయిన తర్వాత నాగార్జున ఎంతగా సంతోషించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ నాగచైతన్యను ఎంతో ప్రేమిస్తూ తనకున్న అన్నీ బిజీ షెడ్యూల్స్ లను క్యాన్సల్ చేసుకొని మరీ అతడి సినిమాల ప్రమోషన్ లకు హాజరవుతుంటాడు నాగార్జున. ఏది ఏమైనా తనని ప్రేమ, ఆప్యాయతలతో చూసుకునే నాగార్జున తన తండ్రి అవ్వడం నాగచైతన్య అదృష్టం అని చెప్పుకోవచ్చు.