గతంలో తనను వెళ్లగొట్టిన చోటే, ప్రస్తుతం బంగ్లా కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నానని హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ నటుడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లా కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#AkshayKumar shared a story about his home and how he was shooed away from the same location 32 years ago but is now the owner of the same place. @akshaykumar pic.twitter.com/NHy10b5kkP
— ♡ KHILADI GROUP ♡ (@KhiladiGroup1) June 21, 2020
అసలేం జరిగింది?
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు తాను ముంబయిలో ఓ ఫొటోగ్రాఫర్ దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడినని చెప్పారు అక్షయ్. అయితే 4-5 నెలలు జీతానికి బదులుగా తనకు ఫొటోషూట్ చేసిపెట్టమని ఆయన్ని అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జుహూ బీచ్ దగ్గర్లని ఓ బంగ్లాను చూశారు. దాని పిట్టగోడపై అక్షయ్ ఉండగా, నాలుగైదు ఫొటోలు తీశారు. ఇంతలో వాచ్‌మన్ వచ్చి వారిని వెళ్లగొట్టాడు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే చోట కట్టిన బంగ్లాలో తాను ఉంటున్నట్లు అక్షయ్ తెలిపారు. గతంలో తనను వెళ్లగొట్టిన చోటే, ప్రస్తుతం బంగ్లా కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నానని హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ నటుడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఫొటోలను కలిపి చూపించారు. ఈ విషయమై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అక్షయ్ నటించిన 'లక్ష్మీబాంబ్' విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటే 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్' రీమేక్‌తో పాటు 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ కథానాయకుడు. ఇలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నప్పుడు ఇరువురు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆనందంతో ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే 140 మంది పైగా దీని గురించి చర్చ మొదలు పెట్టారు. విజయం అంటే ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు.