ఓ ఫ్యాషన్​ మ్యాగ్​జైన్​ సంస్థ, తన అనుమతి లేకుండా కంగన ఫొటోలు ఉపయోగిస్తోందని నటి కంగనా రనౌత్​ బృందం ట్వీట్ చేసింది​. ఇలా వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా ఈ నటి ప్రశ్నించింది. బాలీవుడ్​ క్వీన్​ కంగనారనౌత్ ​ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్​ సంస్థ ఐదేళ్ల క్రితం నిషేధించింది. అయితే నిషేధం ఉన్నప్పటికీ తన చిత్రాలను సదరు మ్యాగ్​జైన్ ​లో ఉపయోగిస్తూ, వారు ప్రచారం చేసుకుంటున్నారని కంగనా రనౌత్​ బృందం ట్వీట్ చేసింది.​

 

 

కంగన రనౌత్​పై ఐదేళ్ల క్రితం వోగ్​ ఇండియా నిషేధం విధించింది. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన ఫ్యాషన్ డిజైనర్​ అనైతా అడజానియా.. ప్రముఖ నిర్మాత కరణ్ ​జోహార్ ​కు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం. కంగనపై నిషేధం విధించినప్పటికీ ఆమె ఫొటోలు, వీడియోలను ఇప్పటికీ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటుందీ సదరు సంస్థ" అని కంగనా రనౌత్​ టీమ్​ ట్వీట్ చేసింది. " ఫ్యాషన్ "​ చిత్రం విడుదల సమయంలో తనను ఎంపిక చేశారని, ఆ తర్వాత ప్రియాంక చోప్రాతో ఫొటోషూట్ చేశారని చెప్పింది కంగనా. ప్రముఖ హీరోయిన్ల జాబితాలో లేకపోవడమే కారణమని అప్పుడు సంస్థ ప్రతినిధులు తనతో చెప్పినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

 

 

2014లో ఓ కవర్ ఫొటోషూట్​​ కోసం తనను సంప్రదించారని, కానీ తనకు స్టైలింగ్ చేసేందుకు డిజైనర్​ అనైతా నిరాకరించిందని కంగనా చెప్పింది. అప్పుడు అనైతా తన సహాయకుడిని పంపిందని తెలిపింది. 'క్వీన్​' సినిమా తర్వాత తరచుగా ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ, మ్యాగజైన్​ కవర్​ కోసం వారితో కలిసి పనిచేశానని కంగనా రనౌత్ చెప్పింది. అయితే ఫొటోషూట్​ ల కోసం అనైతా డిజైనింగ్స్ అడగ్గా, ఆ సంస్థ సరిగా స్పందించకుండా తనతో విచిత్రంగా ప్రవర్తించారని తెలిపింది. అప్పటివరకు కేవలం వోగ్​ తో రెండు కవర్​ ఫొటోల కోసమే పనిచేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిషేధం ఎదుర్కొంటున్నా.. తన ఫొటోలు, వీడియోలను వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది​.

మరింత సమాచారం తెలుసుకోండి: