బాలీవుడ్ లో ఎప్పుడూ నిత్య యవ్వనుడిగా కనిపించే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒరిజినల్ ఫేస్ చూడటం చాలా కష్టమే అని చెప్పాలి. ఆయన సాధారణంగా బయటకు ఎక్కువ రారు.. వచ్చినా ఎవరికీ పెద్దగా స్టిల్స్ ఇవ్వరు. అప్పుడప్పుడు మారు వేశాల్లో వెళ్లి తన అభిమానులను కలిసి వస్తుంటారు. తాజాగా అమీర్ ఖాన్ ఓరిజినల్ గా ఎలా ఉంటారో.. ఆయన కూతురు ఇరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఒరిజినల్ లుక్ ఏంటో తెలియడం కొన్నిసార్లు కష్టమవుతుంది. తెరపై సూపర్‌లుక్‌తో అలరించే తారలకు, తెరవెనుక ఒరిజినల్ లుక్ ఒకటి ఉంటుంది. అలాంటిదే ఈ లుక్.
ముఖ్యంగా అమీర్ ఖాన్ అంత సీనియర్ హీరో అయినా కూడా ఎప్పుడూ కుర్ర హీరోలా కనిపిస్తుంటారు. ఆయన మేకోవర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. అంతే కాదు పాత్రకు తగ్గట్టుగా ఆయన శరీరాన్ని కూడా మర్చుకునే హీరో. ఆ మద్య వచ్చిన దంగల్ చిత్రంలో రెండు విభిన్నపాత్రల్లో నటించి మెప్పించారు అమీర్ ఖాన్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్‌ఖాన్ రకరకాల గెటప్‌లలో కనిపిస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే అమీర్‌ఖాన్ ఒరిజినల్ గెటప్‌కు సంబంధించిన చూడటం చాలా అరుదనే చెప్పాలి. అమీర్‌ఖాన్ రియల్‌లుక్ ఎలా ఉంటుందో..కూతురు ఇరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అసలు ఈ ఫోటో చూస్తే నిజంగా ఏదో గ్రాఫిక్స్ చేశారా అన్న బ్రమ కలుగుతుంది. తెలుపురంగు వెంట్రుకలు, స్క్వేర్ గ్లాసెస్ పెట్టుకుని కూతురు ఇరాతో చిరునవ్వులు చిందిస్తున్నాడు అమీర్. లవ్ లీ ఫొటో అంటూ ఫాతిమా సనాషేఖ్ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.