అదిగో ఆ హీరోయిన్ ఈమధ్య సీక్రెట్ గా ఎవరినో కలుస్తుంది.. ఇదిగో ఈ హీరోయిన్ తరచు ముంబై వెళ్లొస్తుంది.. అక్కడ ఆ హీరోయిన్ ఎవరితోనో లవ్ లో పడ్డది.. ఇక్కడ ఈ హీరోయిన్ కు ఆ హీరో లైటింగ్ వేస్తున్నాడు. ఇలాంటి వార్తలు మీడియాలో తరచు వినిపిస్తూనే ఉంటాయి. అసలు అక్కడ జరిగేది ఏమో కాని వీళ్లు చెసే హడావిడి మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. హీరో హీరోయిన్ కలిసి నటిస్తే ఎఫైర్ అటకట్టేస్తారు.. ఓ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే చాలు వాళ్ల మధ్య ఏదో జరుగుతుందని రాసేస్తారు.

 

హీరోయిన్ పెళ్లి వార్త మంచి ఐటెం గా ఎప్పుడూ ఏదో ఒక మీడియాలో వస్తూనే ఉంటుంది. మొన్నటిదాకా కీర్తి సురేష్ బిజినెస్ మెన్ లవ్ లో పడ్డది. ఆమె పెళ్లి అతనితోనే.. ఆల్రెడీ అతని లవ్ లో అమ్మడు చాలా దూరం వెళ్లిందని వార్తలు రాశారు. కాని అమ్మడు మాత్రం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే అన్నట్టు చెప్పుకొచ్చింది. ఆమె పెళ్లిపై వార్తలు ఓ రేంజ్ లో వస్తే అవన్ని తుస్సు అన్నట్టుగా కీర్తి స్పందన షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కొత్తగా కాజల్ అగర్వాల్ పెళ్లిపై హాట్ న్యూస్ వైరల్ గా మారుతుంది.

 

ఈమెను కూడా ఓ ముంబై బిజినెస్ మెన్ తో ముడిపెడుతూ వార్తలు రాస్తున్నారు. కాజల్ విషయంలో కూడా మీడియా ఉత్సాహం చూస్తుంటే కాజల్ పెళ్లి చేసే దాకా ఈ మ్యాటర్ వదిలేరా లేరు. ఖాళీగా ఉంటే అనుష్క పెళ్లి గురించి రాస్తారు.. ప్రభాస్ తో ఎఫైర్ నుండి.. వచ్చే వారమే ఓ స్టార్ డైరక్టర్ తో అనుష్క పెళ్లంటూ వార్తలు రాస్తారు. హీరోయిన్స్ పెళ్లి అంటే వారి ఇంట్లో వాళ్లకన్నా మీడియా వాళ్లకే ఎక్కువ ఆరాటం అనుకుంటా.. ఈఅమధ్యనే 35 లో అడుగుపెట్టిన కాజల్ పెళ్లి గురించి రోజుకో న్యూస్ తో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఏది నిజం అన్నది మాత్రం ఎవరికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: