అక్కినేని ఫ్యామిలీ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్యకు కరోనా సోకుతుందేమోనన్న భయాలు అభిమానుల్లో చుట్టుముట్టాయి. తాజాగా కరోనా నిర్ధరణ అయిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో సామ్ సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత-నాగచైతన్య జంటకు ఓ ప్రత్యేకత ఉంది. వీరిది ప్రేమ వివాహం అని అందరికీ తెలుసు. మొదటి సినిమాలోనే కలిసి మనసును పంచుకున్నారు. ఇరు కుటుంబాలు ఇష్టపూర్వకంగా గోవాలో పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఇప్పుడు కరోనా మహమ్మారి అందరిని భయపడుతుంది. ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని అందరికీ తెలుసు. ఇప్పుడు చిత్ర సీమలో అందరికీ కలవరపాటు మొదలైంది. ఇప్పుడు కొత్తగా ఈ జంటకు ఆ భయం మొదలైంది. అనే ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ సమంత-నాగచైతన్యకు కరోనా సోకుతుందేమోనన్న అనుమానాలు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి. ఈ వార్తలు చూసిన అభిమానులు షాకవుతున్నారు. తాజాగా సామ్ స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి, ఆమె భర్తకు కరోనా పాజిటివ్ అని తేలడమే ఇందుకు కారణం.
ఇటీవల సామ్, శిల్పా రెడ్డిని గట్టిగా హత్తుకుని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టిన ఫొటోను శిల్పా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరి వీరిద్దరు గతంలో కలుసుకున్నప్పుడు దిగినా ఫొటోనా? లేదా ఇటీవల కాలంలో దిగిందా? అన్నది స్పష్టత లేదు. దీంతో సామ్- చైతూ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో భయాలు అలుముకున్నాయి. అయితే ఈ విషయంపై వీరిద్దరు ఇంకా స్పందించలేదు.ప్రస్తుతం చైతూ 'లవ్‌స్టోరీ'లో నటిస్తుండగా.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్2 వెబ్ సిరీస్‌లో సమంత నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.