రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో యాక్షన్ హంగులతో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ఆశించిన రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక దాని అనంతరం ఎలాగైనా తన ఫ్యాన్స్ కి మంచి హిట్ ఇవ్వాలని భావించిన ప్రభాస్, జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ సినిమా ని లైవ్ పెట్టారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని యూరోప్ లో సాగె రెట్రో ప్రేమకథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు టాక్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారితో కలిసి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడంతో పాటు, ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కూడా నటిస్తున్నారు. 

IHG

ప్రేమపావురాలు సినిమా హీరోయిన్ భాగ్య శ్రీ ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే, సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవడం, అలానే తారాగణం, టెక్నీషియన్స్ అందరూ ఎంపికచేయబడ్డప్పటికీ, కేవలం సంగీత దర్శకుడిని మాత్రం ఇప్పటివరకు ఎంపిక చేయలేదట. ఈ విషయమై కొద్దిరోజులుగా ప్రభాస్ కూడా కొంత నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కలయికలో వచ్చిన డియర్ కామ్రేడ్ కు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు టాక్. 

 

వాస్తవానికి ఇప్పటివరకు ఎక్కువగా తమిళ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ అందించిన ప్రభాకరన్, తెలుగులో డియర్ కామ్రేడ్ కు కూడా మంచి మ్యూజిక్ అందించడం జరిగింది. అయితే కథ రీత్యా మ్యూజిక్ లో మంచి ఫ్రెష్ నెస్ ఉండాలనే తలంపుతో దర్శకనిర్మాతలు జస్టిన్ ని ఎంచుకున్నట్లు చెప్తున్నారు. ఏంటీ ఇతనా మా హీరో సినిమాకి సంగీతాన్ని అందించేది అంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంత సందేహం వ్యక్తం చేస్తున్నప్పటికీ, జస్టిన్ ఇప్పటివరకు నాలుగు ట్యూన్స్ ఇచ్చాడని, అవి అద్భుతంగా ఉన్నాయని ఇన్నర్ టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: