పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు నటించారు. అయితే దాదాపు వాళ్లంతా సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో చోటుచేసుకున్న అనుభవాలను పంచుకుంటూ అతని గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే 2006 మే 3వ తేదీన విడుదలైన బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పంజాబీ ముద్దుగుమ్మ మీరాచోప్రా సంధ్యారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న పాపులారిటీ కారణంగా తెలుగు రాష్ట్రాలలో బంగారం సినిమా చిత్రీకరణ జరిపితే అభిమానులు లక్షల సంఖ్యలో తరలివస్తారని ఫలితంగా చిత్రీకరణ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దర్శకుడు ధరణి భావించారట. అందుకే బంగారం సినిమా చిత్రీకరణ తమిళనాడు లోని ఓ చిన్న గ్రామంలో జరపడం ప్రారంభించారట. అయితే అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఏమీ లేకపోవడంతో కేవలం అతి చిన్న ఇంట్లో నటీనటులకు ఆశ్రమం కల్పించి చిత్రీకరణ పూర్తి చేయడం ప్రారంభించాడు ధరణి. కానీ కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ఉంటున్నారని తెలిసిన అభిమానులు అక్కడికి వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన ఉంటున్న ఇంటి చుట్టూ దాదాపు పదివేలమంది చుట్టుముట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ఇంటి నుండి బయట అడుగు పెట్టాలని పరిస్థితి ఏర్పడింది.
పవన్ కళ్యాణ్ ఉంటున్న ఇంట్లోనే బస చేస్తున్న మీరా చోప్రా అతడి పాపులారిటీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యిందట. అప్పుడే అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక మనిషి కాదని తాను దేవుడని తనకి అర్థం అయిందట. ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశం సినీ ప్రేక్షకులు తమకిష్టమైన హీరోలను మనుషులుగా కాకుండా దేవుళ్ళగా పూజిస్తారు అని నాకు పవన్ కళ్యాణ్ అభిమానులు చూసిన తర్వాత తెలిసింది. నేను ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి సూపర్ పాపులారిటీ ఉన్న హీరోలతో నటించలేదు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన నటించే సరికి అసలైన స్టార్డమ్ ఏంటో నాకు అర్థం అయింది. అతని సరసన బంగారం సినిమాలో నటించినందుకు గాను నేను చాలా గర్వపడుతున్నాను', అని ఆమె చెప్పుకొచ్చింది.