మూడు నెలలుగా కామెడీకి దూరంగా ఉంటున్న తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా అందించడానికి వచ్చేస్తుంది జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. కరోనా వల్ల కనీసం హాయిగా నవ్వుకునే ఛాన్స్ కూడా లేకుండాపోయింది. ఆఫ్టర్ 3 మంథ్స్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ హుశారైన ప్రోమోలతో జోష్ నింపేలా చేశాయి. జస్ట్ ప్రోమోలే మిలియన్ మార్క్ దాటాయంటే ఆడియెన్స్ ఎంత కరువులో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే ఎప్పటిలానే జబర్దస్త్ లో తన పంచులతో హైపర్ ఆది మిగతా స్కిట్స్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు.
జబదస్త్ లో ఈసారి కొత్త టీం లీడర్ తాగుబోతు రమేష్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక ఇదిలాఉంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా ఒకప్పటి స్టార్ కమెడియన్ అదికూడా జబర్దస్త్ ఫ్లాట్ ఫాం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ సర్ ప్రైజ్ చేశాడు. మళ్లీ తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు శంకర్. షకలక శంకర్ కామెడీ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి ఈ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.
మెగా అభిమానిగా షకలక శంకర్ తన టాలెంట్ చూపించాడు. పవన్ జనసేనకు శ్రీకాకులంలో ప్రచారంలో కూడా పాల్గొని హడావిడి చేశాడు. అంతేనా కమెడియన్ గా సినిమాల్లో బిజీగా మారి ఆ తర్వాత హీరోగా కూడా ఒకటి రెండు ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా మళ్లీ బ్యాక్ టూ జబర్దస్త్ అంటూ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడకు వచ్చిన షకలక శంకర్ ఇవి చేస్తూనే సినిమాలు చేస్తాడో లేక జబర్దస్త్ లోనే కొనసాగుతాడో చూడాలి.