హీరోలే కాదండోయ్.. ఇప్పుడు హీరోయిన్లు, కమెడియన్లు సైతం ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. చేసే పాత్ర చిన్నదైనా.. పెద్దదైనా సరే.. క్రేజీ డైలాగ్స్ చెప్పి మనల్ని అలరిస్తున్నారు. బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది.

 

 

కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి యావరేజ్ అందగత్తె అయితేనేమ్ పొరగాళ్లు పడరా.. భద్మాష్ బల్సిందా రా బొక్కలిరగొడ్తా అన్న ఒక్క డైలాగ్ కు పిచ్చొళ్లవుతున్నారు. అందమైన హీరోయిన్ అందమైన యాసలో మాట్లాడుతుంటే చూసినోల్లకు ముచ్చేటేస్తోంది.

 

 

తెలుగు సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ఫిదా సినిమాలో హీరోయిన్ గా నటించిన తమిళ అమ్మాయి మళయాళ చిత్రంప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రజల నుంచి ముఖ్యంగా యువత నుంచి మంచి మార్కులు కొట్టేస్తోంది. సాయి పల్లవి అభినయానికి ఫిదా అయిపోతున్నం అంటున్నారు యావత్ తెలంగాణ యూత్.

 

 

సినిమాలో సాయి పల్లవి పాత్ర లో ప్రతి తెలంగాణ అమ్మాయి తనకు తానుగా చూసుకుంటున్నారు. అందుకే ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ అందరికీ దగ్గరవుతోంది.  తెలుగు సినిమా అంటే కొన్ని పేరుమోసిన గ్రామాలు ప్రాంతాలనే చూపించడం ఆనవాయితిగా వస్తుంది టాలివుడ్ లో కానీ తెలంగాణ లోనూ అందమైన రమణీయ ప్రకృతి సౌందర్యం ఉందని. తెలంగాణ గ్రామీణ వాతావరణా న్ని కల్చర్ ని చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు శేఖర్ కమ్ముల.

 


తెలంగాణ భాష యాస ఉద్యమాలనే కాదు సినిమాల ను కూడా సక్సెస్ చేస్తై అంటూ చమత్కరిస్తున్నారు పలువురు తెలంగాణ రచయితలు. శేఖర్ కమ్ముల నూతన ఒరవడి తెచ్చాడని చెపుతున్నారు. ఇకపై ఈ ట్రెండు కంటిన్యూ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ కనిపించదు భానుమతి మాత్రమే కనిపిస్తది గందుకే మళ్ల పోరగాళ్లు ఫిదా అయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి: