అయితే ఓ వైపు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ప్రేక్షకులను అలరించినప్పటికీ ఎక్కువ మొత్తంలో మాత్రం చీరలోనే అలరిస్తూ ఉండేది సిమ్రాన్. అయితే డాడీ సినిమాలో సిమ్రాన్ చిరంజీవికి భార్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే, డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చిరంజీవినీ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది సిమ్రాన్, ఆ తర్వాత ఎంతో బాధ్యతాయుతమైన ఇల్లాలుగా సిమ్రాన్ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక స్నేహితులకు సహాయం చేసి తన కూతురు ప్రాణం పోవడానికి భర్త కారణం అయ్యాడని అనుకున్న సిమ్రాన్ భర్త నుంచి దూరంగా ఉంటుంది.
ఇక ఆ తర్వాత పుట్టిన తన కూతురుని ఎంతో ప్రేమగా చూసుకోవడం... తల్లి తండ్రి తానే పెంచడం ఇలా తన హావభావాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది . అదే సమయంలో తన కూతురిని తండ్రికి దగ్గర కాకుండా చూడడం... ఒకవేళ తండ్రికి దగ్గరైతే మళ్లీ ఎక్కడ ఈ కూతురు కూడా దూరం అవుతుందో అనే హావభావాలను పండించడంలో సిమ్రాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అని చెప్పాలి.
Powered by Froala Editor