హీరోయిన్లకు ఏమి బరువు బాధ్యతలు ఉంటాయని అనుకోవచ్చు. నిజానికి ఒక సినిమా హిట్ కావాలంటే వారు పాత్ర ఎక్కువ. వారే నిండుగా గ్లామర్ రసం ఒలకబోయాలి. దాన్ని కంట్లో చిలకరించుకుని ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మ‌రధం పడితే క్రెడిట్ మాత్రం హీరోలకు, డైరెక్టర్లకు పోతుంది.

IHG

మరి ఇంతలా గ్లామర్ ఒలకబోయడానికి హీరోయిన్లు ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. ఓవైపు వర్కౌట్స్ చేస్తారు. మరో వైపు డైటింగ్ పాటిస్తారు. నోరు ఊరిస్తున్నా దాచుకుని తిండి తినడం మానేస్తారు. నాజూకుగా కనిపించాలని తెగ కసరత్తులు చేస్తారు. అందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎప్పటికపుడు ట్రై చేస్తూంటారు.

IHG

ఎందుకంటే ఆ అందమే వారికి పెట్టుబడి కాబట్టి. సరే సినిమా షూటింగులు వరసగా ఉంటే డ్యాన్సులు ఇతరత్రాలతో  హీరోయిన్లకు అదే పెద్ద ఎక్సర్ సైజ్. కానీ ఇపుడు లాక్  డౌన్ డౌన్  మూడు నెలలు పై దాటిపోతోంది. క్లాపులు లేవు. యాక్షన్ లేదు, లైట్లు ఆన్ లేదు, కెమెరా స్టార్ట్ అంతకంటే లేదు. దాంతో ఇంట్లో తినడం తొంగోవడంతో చాలా మంది హీరోయిన్ల గ్లామర్ దెబ్బతింటోందిట.

IHG

కొంతమంది బాగా లావెక్కిపోతున్నారుట. ఫిగర్ మెయింటెయిన్ చేయడం చాలా కష్టంగా ఉందిట. లాక్ డౌన్ పుణ్యమాని జిమ్ములు తెరవడంలేదు. దాంతో అక్కడకు వెళ్ళి చమట కార్చుదామంటే కుదిరేది లేదు. ఇంట్లోనే చాలా మంది హీరోయిన్లు వర్కౌట్స్ చేస్తున్నారుట. అయితే ఆ డోస్ సరిపోవడంలేదుట.

IHG

ట్రైనర్ తోనే చేసి ఒళ్ళు కరిగించుకోవాలంటే లాక్ డౌన్  షరతులు చాలా ఉన్నాయి. దాంతో చాలా మంది హీరోయిన్లకు భయం పట్టుకుందిట. ఇలాగే వదిలేస్తే రేపటి రోజుల హీరోయిన్ కాస్తా ఆంటీ షేపులోకి వస్తే ఆఫర్స్  హుష్ కాకీ అవుతాయని తెగ ఫియర్ అవుతున్నారుట. మరి చూడాలి ఈ బరువులూ బాధ్యతలు మోయడం హీరోయిన్లకు ఎంత కష్టమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: