కరోనా కేసులు రోజు రోజుకూ పెరగడం మన స్టార్స్‌ను భయపెడుతోంది. నిన్నటివరు ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌కు పర్మిషన్‌ ఇస్తారా..ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్లిపోదామా? అని కాచుకుని కూర్చున్న హీరోలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. షూటింగ్‌ అంటే  వెయిట్‌ చేద్దామంటున్నారు. 

 

షూటింగ్స్‌ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... స్టార్స్ మాత్రం ఇప్పట్లో సెట్స్‌పైకి  వచ్చేది లేదంటున్నారు. నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ వున్నా.. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రప్రభుత్వాలు చాలా సడలింపులు ఇచ్చేశాయి. జన జీవనం సాధారణస్థాయికి వచ్చేసింది. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోయాయి. కేసులతోపాటు.. మరణాలు కూడా పెరగడంతో సినిమా ఇండస్ట్రీ ఆందోళనలో పడింది. షూటింగ్‌ చేయాలా? వద్దా అని తర్జనభర్జన పడుతున్నాయి. 

 

కరోనా భయం మన హీరోలను వెంటాడుతోంది. ఎంతగా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నా... చిత్ర యూనిట్‌ సంఖ్యను 50కి కుదించినా... కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే షూటింగ్ చేసుకుందామన్న సంకేతాలు హీరోలు పంపిస్తున్నారట. హీరో లేకుండా షూటింగ్స్ స్టార్ట్‌ చేయాలని నిర్మాతలు అనుకోవడం లేదు. ఈలెక్కన పెద్ద సినిమాలు ఇప్పట్లో సెట్స్‌పైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈలెక్కన బన్నీ నటిస్తున్న పుష్ప... ప్రభాస్‌ జాన్‌.. మహేశ్‌ సర్కార్‌ వారి పాట సినిమాల షూటింగ్స్‌ ఈ నెలలో మొదలుకావడం కష్టమే. 

 

కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చే దాకా వెయిట్‌ చేద్దామన్న వుద్దేశంలో కొందరు స్టార్స్‌ వున్నారట. వచ్చిన తర్వాతే కెమెరాముందుకు రావాలని స్టార్స్‌ డిసైడ్‌ అయితే.. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారో తెలీని గందరగోళ పరిస్థితిలోకి సినిమా ఇండస్ట్రీ వెళ్లిపోతుంది. ఆ మధ్య కృష్ణ బర్త్ డే  సందర్భంగా మే 31 మహేశ్‌ కొత్త సినిమా 'సర్కారు వారి పాట'ను ఎనౌన్స్‌ చేశారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను సెప్టెంబర్‌లో మొదలుపెడతారన్న వార్తలొస్తున్నాయి. మొత్తానికి మన హీరోలు షూటింగ్ అంటేనే వణికిపోతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: