ఆమె కొత్త హీరోయిన్ అయినా సరే.. పాపులర్ హీరోయిన్ అయినా క్రేజ్ వచ్చింది అంటే చాలు ఏదో ఒక మేగజైన్ కవర్ పేజ్ కు ఎక్కినట్టే. హీరోయిన్స్ క్రేజ్ ను బట్టి కవర్ పేజ్ ఆఫర్స్ వస్తాయి. కొందరు హీరోయిన్స్ కావాలని కవర్ పేజ్ పై అందాలతో అలరిస్తారు. కొందరు మాత్రం అవకాశం వచ్చినప్పుడే కవర్ పేజ్ కు ఎక్కుతారు. సిని కెరియర్ లో పాపులారిటీని బట్టి ఈ కవర్ పేజ్ కవరేజ్ ఉంటుంది. పాపులర్ హీరోయిన్స్ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మేగజైన్ సేల్ కూడా బాగా ఉంటుందని సెంటిమెంట్.
అంతేకాదు కవర్ పేజ్ మీద ఉన్న కథానాయిక స్పెషల్ ఇంటర్వ్యూస్ తో పాటుగా ఇదివరకు ఎప్పుడు రివీల్ చేయని సీక్రెట్స్ కూడా ఆ ఇంటర్వ్యూస్ లో వెళ్లడిస్తారు. ఇక కవర్ పేజ్ ఫోటో అంటే కవ్వించే అందాలతో అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అందరు భామలు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మేగజైన్ కు కవర్ పేజ్ ఎక్కినవారే. సినిమాలు హిట్టు కొడితే వరుస ఛాన్సులతో పాటుగా కవర్ పేజ్ ఆఫర్స్ కూడా వస్తాయి.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే కవర్ పేజ్ పై హీరోయిన్ ఫోటో వేస్తే దానికి కొంత రెమ్యునరేషన్ కూడా తీసుకుంటారు. ఇక ఈ కవర్ పేజ్ పై ఫోటో కోసం స్పెషల్ ఫోటో షూట్ నిర్వహిస్తారు. ఎలాగైనా సరే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కథానాయికలకు కవర్ పేజ్ పై ఎక్కేస్తారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కథానాయికలు మేగజైన్ కవర్ పేజ్ పై ఎక్కి హల్ చల్ చేస్తుంటారు.