టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరైన స్వరవాణి కీరవాణి ముందుగా మనసు మమత సినిమాతో టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత నుండి తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకున్న కీరవాణి, మెల్లగా ఒక్కో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగారు. ఇకపోతే ఇప్పటివరకు కెరీర్ పరంగా ఆయన ఎన్నో సినిమాలకు సంగీతం అందించడం జరిగింది. అయితే ఎక్కువగా కె రాఘవేంద్ర రావు తీసే సినిమాలకు సంగీతం అందించే అలవాటున్న కీరవాణి, ఆయన తీసిన అత్యద్భుత దృశ్య కావ్యం అన్నమయ్య సినిమాకు ఎంతో సుమధురంగా పాటలను అందించడం జరిగింది. 

IHG

నిజంగా ఆ సినిమాలోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పకతప్పదు. ఆ విధంగా కీరవాణి తన బాణీలతో పాటలకు ప్రాణం పోశారు అనే చెప్పాలి. అప్పట్లో ఎంతో పెద్ద హిట్ కొట్టిన ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర వహించాయి. సందర్భానుసారం అన్నమయ్య జననం దగ్గరి నుండి ఆయన అంత్యోదయం వరకు కూడా సాగే ప్రతి ఒక్క పాట కూడా నిజంగా శ్రోతలను ఎంతో అలరిస్తాయి. అలానే మధ్యలో ఒక సందర్భంలో తన మరదల్లిద్దరితో కలిసి అన్నమయ్య పాడే రొమాంటిక్ సాంగ్ కి కూడా ఆకట్టుకునే ట్యూన్ ని అందించారు కీరవాణి. 

 

దాదాపుగా ఈ సినిమాలో వచ్చే పాటలన్ని కూడా అన్నమయ్య సంకీర్తనలు అయినప్పటికీ మధ్యలో వచ్చే ఏలే ఏలే మరదలా, తెలుగు పదానికి జానపదం, పాల నేత్రాలు, అస్మదీయ మగసిరి వంటి పాటలను మాత్రం వేటూరి, అలానే పదహారు కళలకు పాటను జేకే భారవి రాయడం జరిగింది. మొత్తంగా తన కెరీర్ లో నిలిచే ఈ అన్నమయ్య సినిమాలో వచ్చే ఇరవైకి పైగా పాటలకు గాను కీరవాణి ఎంతో గొప్ప సంగీతాన్ని అందించి తన సంగీత ప్రత్యేకతను చాటుకున్నారు. 1997లో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట భక్తి కార్యక్రమాల్లో వినపడుతూనే ఉంటాయి అంటే ఆ పాటల యొక్క మాధుర్యం ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఆ విధంగా కీరవాణి మ్యూజికల్ కెరీర్ లో అన్నమయ్యకు ప్రత్యేక స్థానం దక్కుతుంది అని చెప్పాలి.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: