అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సుకుమార్ కూడా రంగస్థలం హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్.

 

అయితే సెన్సిబుల్ డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. దిల్ రాజు సహకారంతో బన్నికి కథ వినిపించాడట. కాకపోతే ఆ కథను బన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంద్. అల్లు అర్జున్ ఈమధ్య కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. కొన్నిసార్లు సినిమాలో కథ లేకున్నా డైరక్టర్ మీద నమ్మకంతో సినిమా చేయాల్సి వస్తుంది. కాని ఇప్పుడు అలా కాకుండా కేవలం కంటెంట్ మీద నమ్మకంతోనే సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా కథ ప్రయోగాత్మకంగా ఉందట అందుకే బన్ని రిస్క్ ఎందుకని లైట్ తీసుకున్నాడు.

 

ప్రస్తుతం నాని హీరోగా వి సినిమాను డైరెక్ట్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ తన నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతో చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. విజయ్ దేవరకొండ పూరి డైరక్షన్ లో ఫైటర్ సినిమా పూర్తి కాగానే ఇంద్రగంటి సినిమా ఉంటుందని తెలుస్తుంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: