ఒక వైపు ఎన్నకలు తరుము కుంటూ వస్తుంటే అవి ఏమి పట్టకుండా నందమూరి సింహం బాలకృష్ణ తన ‘లెజెండ్’ సక్సెస్స్ హడావిడిలో రోజులు గడిపేస్తూ తన అభిమానులకు ఇచ్చిన మాట తప్పుతున్నాడు. లెజెండ్ విజయోత్సవ యాత్రలో తను రాబోతున్న ఎన్నికలలో పోటీ చేయడo ఖాయం అని చెప్పి రోజులు గడవకుండానే తన ఎన్నికల పోటీ విషయంలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ వ్యూహాత్మక మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఈ మౌనం పై రకరకాల కధనాలు వినపడుతున్నాయి.
రాబోతున్న ఎన్నికలలో బాలకృష్ణను కోస్తా ప్రాంతం నుండి కాని అదేవిధంగా సీమ ప్రాంతం నుండి కాని ఎన్నికల బరిలోకి దింపడానికి చంద్రబాబు సుముఖంగా లేడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పార్టీలో మరో బలవత్తర శక్తిగా బాలకృష్ణ ఎదుగుతాడు కాబట్టి రాబోయే పరిణామాన్ని ముందుగానే ఊహించి బాలకృష్ణను కేవలం ప్రచారానికి మాత్రమే రాబోతున్న ఎన్నికలలో వాడుకునే వ్యూహంలో బాబు ఉన్నాడు అని అంటున్నారు.
ఈ విషయానికి సంబంధించి అర్ధం పసిగట్టిన బాలయ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘లెజెండ్’ సక్సస్ మీట్ సభలలో తన తండ్రి నందమూరి తారకరామారావు గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు కాని రాబోతున్న ఎన్నికలలో తన అభిమానులను తెలుగుదేశానికి ఓటు వేయండి అని ఒక్క మాటను కూడ మాట్లాడక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇప్పటికే భారతీయజనతా పార్టీతో చంద్రబాబు కుదుర్చుకున్న ఎన్నికల సద్దుబాటుతో మండిపోతున్న తెలుగుదేశం కేడర్ బాలయ్యా చంద్రబాబుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మరింత పార్టీకి నష్టాన్ని గురిచేస్తుందని భయపడి పోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: