ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా మూవీ లో కూడా నటిస్తున్న పవన్, వీలైనంత త్వరగా వాటి షూటింగ్స్ పూర్తి చేసి ఆ సినిమాలను ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇటీవల కరోనా కారణంగా ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమా మిగిలిన షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని, అలానే దసరా కానుకగా సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్. అలానే దానితో పాటు క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొననున్నారట.

IHG'Agnyaathavaasi' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOX OFFICE' target='_blank' title='box office-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>box office</a> collection ...

ఇకపోతే వీటి తరువాత మాస్, కమర్షియల్ సినిమాల  దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. కాగా త్వరలో తెరకెక్కబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనునన్నట్లు లేటెస్ట్ టాక్. మరోవైపు ఇప్పటికే మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కీర్తి, ఇటీవల ఈ సినిమా అఫర్ తనవద్దకు రావడంతో ఒప్పుకుందని అంటున్నారు. 

 

కథ రీత్యా హీరోయిన్ క్యారెక్టర్ కు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని, అటువంటి పాత్రకు కీర్తి అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు హరీష్, ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. వాస్తవానికి గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసిలో ఒక హీరోయిన్ గా నటించిన కీర్తి, ఈ సినిమా ద్వారా మరొక్కసారి ఆయన సరసన నటించనుందన్నమాట. కాగా ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు వెల్లడి కావలసి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: