ఆరెక్స్ 100 సినిమాతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ వరుస ఛాన్సులు అందుకుంటుంది. అయితే లేటెస్ట్ గా ఓ రెండు పెద్ద సినిమాల్లో అమ్మడు ఐటం సాంగ్స్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఇండియన్2, తెలుగులో భారీ అంచనాలతో వస్తున్న భీష్మ ఈ సినిమాల్లో పాయల్ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని న్యూస్ లు వచ్చాయి. శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కే ఇండియన్ 2లో పాయల్ సాంగ్ ఉండబోతుందని రెండు వారాలుగా వస్తున్న న్యూస్.

 

ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ రెండు సినిమాల్లో పాయల్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని అనుకున్నారు. అయితే పాయల్ మాత్రం నేను ఐటం సాంగ్స్ చేయట్లేదని చెప్పేసింది. ఆరెక్స్ 100 తర్వాత పాయల్ కు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ చివర్లో వెంకీమామ సినిమాతో హిట్ అందుకున్న పాయల్ ఈ ఇయర్ మొదత్లో డిస్కో రాజా సినిమాలో నటించి మెప్పించింది. అయితే డిస్కో రాజా సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.

 

పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్ర కారు హృదయాలను దోచేస్తున్న పాయల్ సరైన సినిమాలు పడితే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చ్కునే ఛాన్స్ ఉంది. అయితే ఆరెక్స్ 100 తరహా సినిమాలే చేస్తే మాత్రం కొన్నాళ్లకు కెరియర్ లో వెనుకపడక తప్పదు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులు చేతులో ఉన్న ఈ అమ్మడు ఇప్పుడప్పుడే ఐటం సాంగ్స్ చేసే ఆలోచన లేదని చెబుతుంది. సీత సినిమాలో ఒక సాంగ్ చేసిన పాయల్ ఆ సాంగ్ చేసిన తర్వాత అసలు విషయాన్ని గుర్తించింది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: