ఉదయ్ కిరణ్.. మనం ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. ఓ మంచి హీరోను టాలీవుడ్ మిస్ చేసుకుంది. సినీ కెరీర్ ప్రారంభంలోనే మూడు సూపర్ హిట్ సినిమాలతో అలరించిన ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఈ లోకంలోనే లేడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో కొన్ని సినిమాలతోనే అభిమానులను భారీ స్థాయిలో పెంచుకున్నాడు.
తెలుగు ప్రేక్షకులంతా స్టార్ హీరో అవుతాడు.. మంచి స్థానంలో ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో ఎలా అయితే స్టార్ హీరో అయ్యాడో అలానే ప్లాప్ లు చూస్తూ వచ్చాడు. ఓ మంచి స్టార్ హీరో అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ కు ఎక్కడ అవకాశాలు రాక.. వచ్చిన అవకాశాలు వెనిక్కి పోయాయి.
స్టార్ హీరోగా కొద్దీ కాలం కొనసాగిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఇండస్ట్రీలో నువ్వు ఎవరు అనే రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఉదయ్ కిరణ్ తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వడం.. అవకాశాలు రాకపోవడం ఉదయ్ కిరణ్ కు కాస్త డిప్రెషన్ ను మిగిల్చింది. పెళ్లి అయినా కొద్దీ కాలానికి సినిమా తీసాడు.
కానీ అదే చివరి సినిమా. ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఉదయ్ కిరణ్ చనిపోయి ఇప్పటికి ఆరు ఏళ్ళు అయ్యింది. చివరి సినిమా విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఓటిటి పై విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎప్పుడు ఓటిటిపై విడుదల అవుతాయి అనేది చూడాలి. ఏది ఏమైనా టాలీవుడ్ ఓ మంచి హీరోను మిస్ చేసుకుంది. అంత బాగుండి ఉంటే ఈరోజు టాప్ హీరో అయ్యేవాడు.