టాలీవుడ్ ఇండస్ట్రీలో  అతితక్కువ కాలంలో  స్టార్ హీరోలు గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోలు చాలా మండే ఉన్నారు.. అందులో ఒకరు నాని  . అతని సినిమాలు అతను కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలు అన్నీ కూడా అతనిని  ఒక స్టార్ ని చేసాయి. రేడియో జాకీగా తన కెరియర్ ను మొదలు పెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్దల మన్ననలను అందుకుంటూ అష్టా చమ్మా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించి ఇప్పుడు స్టార్ హీరోగా వరుస హిట్ సినిమాల లో నటిస్తున్నారు.

 

 

అతను మాత్రం ఆ టైం లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి స్టార్ హీరోలు కూడా సవాల్ చేసాడు అనే చెప్పాలి. ఆ సినిమాలు సాధించిన విజయం తర్వాత అతనికి చాలా మంచి ఆఫర్లు వచ్చాయి.  ప్రముఖ దర్శక నిర్మాతలు అతని తో సినిమాలు చేయడానికి గానూ ముందుకు వచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా లేని విధంగా అతని సినిమాల్లో ఉన్న  కథలు వాటికి అతను ఇచ్చిన ప్రాధాన్యత అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

 

 

అతని నటన,కథల ఎంపిక అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులకు నచ్చాయనే చెప్పాలి. ఏ స్టార్ హీరో కూడా చేయలేని విధంగా యూత్ ని ఆకట్టుకునే విధంగా అతను కథలను ఎంపిక చేసుకున్నాడు అనే చెప్పాలి. అలా ఒక్కో హిట్ వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోల లో ఒకరుగా చలామణీ అవుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన అన్నీ సినిమాలు వరుస హిట్స్ ని అందుకున్నాయి. ప్రస్తుతం మూడు సినిమాల లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు కూడా హిట్ అయితే ఇంకా నాని రేంజ్ పూర్తిగా మారిపోతుందని టాక్ సినీ వర్గాల్లో కోడై కూస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: