సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా జోడి కట్టనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనుండగా జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, ఈ సినిమాని కూడా హిట్ చేసి, మరొక హ్యాట్రిక్ కి పునాది వేయాలని చూస్తున్నారు. 

IHG's formula | TeluguBulletin.com

ఇకపోతే మరోవైపు ఇటీవల కొన్నాళ్లుగా తన సినిమాలకు తాను కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న సూపర్ స్టార్, అతి త్వరలో యువ హీరో శర్వానంద్ తో ఒక సినిమా చేయనున్నట్లు కొన్నాళ్లుగా ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు, తన వద్ద ఉన్న ఒక కథను మహేష్ సతీమణి నమ్రత కు వినిపించడం జరిగిందని, తరువాత ఆ కథను విన్న సూపర్ స్టార్ మహేష్, ఈ కథ విజయ్ లేదా శర్వానంద్ లకు అయితే సరిగ్గా సరిపోతుందని భావించారని, అన్ని వర్కౌట్ అయి వారిద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకుంటే తాను నిర్మాతగా దానిని నిర్మించాలని భావించారట. 

 

అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ, పూరి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ తో బిజీగా ఉండడంతో పాటు అతడికి మరొక రెండు మూవీ ప్రపోజల్స్ లైన్లో ఉన్నాయని తెలియడంతో, సదరు యువ దర్శకుడుని శర్వానంద్ వద్దకు పంపడం, ఆ కథ విన్న శర్వా ఎంతో ఎగ్జైట్ అయి వెంటనే చేయడానికి సిద్ధం అవడం జరిగిందట. తన సినిమాకు మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం ఆనందంగా ఉందని, అతి త్వరలో ప్రస్తుత కరోనా పరిస్థితులు సెట్ అయిన అనంతరం తమ సినిమాని అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలెడతామని తన సన్నిహితులతో శర్వా చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, తొలిసారిగా మహేష్ బాబు నిర్మాతగా శర్వానంద్ హీరోగా ఒక సినిమాని చూడవచ్చన్నమాట.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: