దక్షిణ భారతదేశంలోని నటీమణులలో ఎక్కువ పాపులారిటీ ఉన్న
సమంత అక్కినేని కి సోషల్ మీడియాలో కోట్ల మంది అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక
ఇంస్టాగ్రామ్ ఖాతాలోనే ఆమెకి 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె తన ఫోటోలను వీడియోలను తరచూ షేర్ చేస్తూ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. తన పెంపుడు
కుక్క పిల్ల హ్యాష్ కి సంబంధించిన ఫోటోలను, నాగచైతన్యతో తన
రొమాంటిక్ క్షణాలను,
యోగా మెడిటేషన్ ఫోటోలను అన్ని ఆమె తన
ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా
మార్చి నుండి
జూన్ వరకు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో ఈ ముప్పైమూడేళ్ళ నటీమణి చాలా ఫోటోలను, వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. అయితే ఒక పోస్టులో ఆమె
మేకప్ వేసుకోకుండా దిగిన ఒక ఫోటోని షేర్ చేసుకుంది. ఆమె వెండితెర పై ఎంత అందంగా ఉంటుందో ఈ నో
మేకప్ ఫోటోలో కూడా అంతే అందంగా ఉంది. నిజానికి సహజం గా కనిపించిన
సమంత అక్కినేని సినిమాలో కంటే చాలా అందంగా ఉంది.

ఇతర నటీమణులతో పోలిస్తే
సమంత అక్కినేని గొప్ప అందగత్తె అని స్పష్టమైంది.
మార్చి నెలాఖరులో ఒక నో
మేకప్ ఫోటో పోస్ట్ చేసిన
సమంత అక్కినేని మళ్లీ ఏప్రిల్ నెలలో మరొక నో
మేకప్ ఫోటో పోస్ట్ చేసి సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు సెలబ్రిటీలను కూడా తన సహజ అందంతో ఆశ్చర్యపరిచింది. నందినిరెడ్డి,
రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్,
చిన్మయి శ్రీపాద తదితరులు
సమంత అక్కినేని సహజ అందం గురించి తెగ పొగిడేశారు.

జూన్ 24వ తేదీన తన
ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లలో తన సహజ అందాన్ని మళ్లీ ప్రేక్షకుల చూపించి అందర్నీ
ఫిదా చేసేసింది. ఈ సుదీర్ఘమైన లాక్ డౌన్ సమయంలో 48 రోజులు పాటు ఇషా క్రియ ప్రాసెస్ పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్న
సమంత అక్కినేని ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అలాగే తన లాగా అందరూ మెడిటేషన్ చేసే ఆరోగ్యకరంగా మారాలని ఆమె అందర్నీ ప్రేరేపిస్తుంది.
Powered by Froala Editor