టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి UTV నిర్మాణ సంస్థ మరో లేటెస్ట్ ట్విస్ట్ ఇచ్చింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఆ మధ్యకాలంలో UTV మోషన్ పిక్చర్స్ మహేష్ సినిమాను డ్రాప్ చేసింది అని వార్తలు వచ్చినా ఆ సంస్థ సౌత్ డివిజన్ హెడ్ అయిన ధనంజయన్ గోవింద్ ఈ సినిమా కేన్సిల్ కాలేదనీ జూలై నుండి ఈ సినిమా మొదలవుతుందనీ అధికారికంగా తన ట్విటర్ లో తెలపడంతో ఈ సినిమా ప్రాజెక్ట్ నూటికి నూరు పాళ్ళు ఖాయం అని అనుకున్నారు అందరు.  అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు మారారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మైత్రి మూవిస్ వారు నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మైత్రీ మూవీస్ వారు యుఎస్ బేస్ ఉన్న ఎన్నారై గ్రూప్. వారు రీసెంట్ గా ఓవర్ సీస్ లో రెండు పెద్ద చిత్రాలను పంపిణీ చేసారు. అయితే UTV ఎందుకు తప్పుకుందనేది కారణం తెలియదు. ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన కూడ ఏమీ లేదు. కానీ మహేష్ కోరటాల శివల సినిమాకు నిర్మాతలు మారారు అనే వార్త మాత్రం ఫిలింనగర్ లో తెగ హడావిడి చేస్తోంది. ఈ సమస్యకు కారణం మహేష్ UTV సినిమాతో సమాంతరంగా మణిరత్నం దర్సకత్వంలోని మల్టీ స్టారర్ లో కూడ నటించడానికి మోజు పడుతూ ఉండటంతో కార్పోరేట్ పద్ధతులకు అలవాటు పడ్డ యూటివి నిర్మాణ సంస్థ ఈ డేట్స్ క్లాష్ తల నొప్పి నుండి తప్పించు కోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది అని కొదరు అభిప్రాయ పడుతున్నారు. అసలు విషయం మరి కొద్ది రోజులలో తేలుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: