టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా ఎంఎస్ రాజు నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీప్రసాద్, ఆ తరువాత శ్రీనువైట్ల తీసిన ఆనందం సినిమాతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మ్యూజిక్ కూడా అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన దేవి, ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లోని దాదాపుగా అందరూ హీరోలతో కూడా పని చేసాడు.
ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల సూపర్ హిట్స్ తో వరుసగా మూడు విజయాలు తన ఖాతాలో వేసుకున్న దేవి, ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న పుష్పకు మ్యూజిక్ అందిస్తున్నాడు. వాస్తవానికి గత కొన్నాళ్లుగా దేవిశ్రీ ఇస్తున్న మ్యూజిక్ తాము ఆశించిన రేంజ్ లో లేదని కొందరు ప్రేక్షకులు, సంగీత అభిమాలులు పెదవి విరుస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న దేవి, ఒకప్పుడు అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చెవాడని, అయితే ఇటీవల మాత్రం ఎందుకో ఆయన మ్యూజిక్ లో ఫీల్ మిస్ అవుతోంది అనేది వారి భావన.
దానితో ప్రస్తుతం చేస్తున్న పుష్ప పై మరింత గట్టిగా దృష్టి పెట్టిన దేవి, ఈ సినిమా సాంగ్స్ అదరగొట్టేలా కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే మొదటి నుండి సుకుమార్, దేవి ల కాంబోకు మంచి క్రేజ్ ఉంది, అలానే దేవి కూడా సుకుమార్ సినిమాలకు మ్యూజిక్ అదరగొడుతూ ఉంటాడు, ఆ విధంగా పుష్పకు కూడా మంచి ట్యూన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఆశిస్తున్న రేంజ్ లో దేవి పుష్ప కు మ్యూజిక్ ఇస్తాడో లేదో తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.....!!!