యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ ఇసినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత నుండి వరుసగా చేసిన అన్ని సినిమాలతో కూడా విజయాలు అందుకుంటూ దర్శకధీరుడిగా ముందుకు సాగుతున్న రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా తీసిన బాహుబలి రెండు భాగాలు కూడా ఎంతో గొప్ప విజయాలు అందుకోవడంతో పాటు తెలుగు సినిమా పేరు ప్రతిష్టలు ప్రపంచానికి వెలుగెత్తి చాటడం జరిగింది.
ఇకపోతే ఆ సినిమాల అనంతరం ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్ తీస్తున్న రాజమౌళి, దానితో కూడా మరొక సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా మొదలైనదగ్గరి నుండి అటు ప్రేక్షకులతో పాటు ఇటు మెగా, నందమూరి ఫ్యాన్స్ లో ఒకటే ఆలోచన, ఇద్దరు హీరోల్లో ఎవరి పాత్ర తెరపై ఎలా ఉంటుందో అని. అయితే ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ, తాను కథను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరు హీరోలను తీసుకున్నానని, తప్పకుండా రేపు తెరపై వీరిద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటారని అన్నారు.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో చరణ్ చేస్తున్న అల్లూరి పాత్ర అలానే, ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం పాత్ర రెండూ కూడా తెరపై ఒకదానిని మించి మరొకటి ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయట. అలానే పాటలు, యాక్షన్ సీన్స్ తో పాటు సందర్భానుసారం కథ సాగే క్రమంలో ఈ ఇద్దరు హీరోల పోరాట సన్నివేశాలు ఉంటాయని, వాటిని రాజమౌళి తెరకెక్కించిన తీరు అదరహో అనే రేంజ్ లో ఉంటుందని టాక్. మొత్తంగా చూస్తే రేపు రిలీజ్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా, అటు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనంగా ఉండేలా కనపడుతోంది....!!