బాలీవుడ్ బ్యూటీIHG.. తెలుగువారికి కూడా సుపరిచితురాలే. ఎందుకంటే.. తెలుగులో పవన్ కళ్యాణ్‌కు జోడీగా బద్రి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మహేష్ బాబుకు జోడీగా నాని సినిమాలో నటించిన అమీషా.. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు జంటగా నరసింహుడు సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే స్టార్ హీరోలతో నటించినా.. తెలుగులో ఈ అమ్ముడు అంతగా క్లిక్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసింది ఈ బ్యూటీ. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో నటించిన సినిమా `పరమవీర చక్ర`.
ఇందులో ఆమె బాలకృష్ణ సరసన నటించింది. ఇక ప్రస్తుతం అమీషా చేతులో ఎలాంటి ఆఫర్లు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హాట్ హాట్ ఫోటోలు పెడుతూ.. 40 ఏళ్ల వయస్సులోనూ చెమటలు పట్టిస్తోంది. తాజాగా కూడా అమీషా పటేల్ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.