మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలలో రన్నరప్ గా నిలిచిన పూజా హెగ్డే అందరిలాగానే సినిమా రంగం వైపు అడుగులు వేసింది. పూజా హెగ్డే 2012వ సంవత్సరంలో మూగమూడి అనే తమిళ మూవీ ద్వారా సినిమా రంగంలో అరంగేట్రం చేసింది. తదనంతరం ఒక లైలా కోసం, ముకుంద, మోహేంజో  దారో చిత్రాలలో నటించి మంచి నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ సరసన నటించిన ముకుందా సినిమా వలన ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముంబై లో పుట్టి పెరిగిన ఈ కన్నడ భామ మాతృభాష తుళు కాగా... వాళ్ల తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రం నుండి ముంబాయి నగరానికి షిఫ్ట్ అవడంతో ఆమెకు హిందీ బాగా వచ్చేసింది.


2017 సంవత్సరంలో అల్లుఅర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం-డిజె సినిమాలో నటించిన పూజా హెగ్డే అందచందాలకు అభినయానికి తెలుగుప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. దాంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో ఒక అగ్రతారా స్థాయికి చేరుకుంది. 2018 సంవత్సరంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా లో జిగేల్ రాణి పాటలో సూపర్ సెక్సీ గా నాట్యం చేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత సాక్ష్యం, అరవింద సమేత వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో కూడా నటించి తన పాపులారిటీని తారా స్థాయికి తీసుకెళ్లింది. గద్దల కొండ గణేష్ సినిమాలో శ్రీదేవి పాత్రలో నటించిన పూజా హెగ్డే అందచందాలకు అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు.


2020 వ సంవత్సరంలో విడుదలైన అల వైకుంఠ పురములో సినిమా లో అమూల్య పాత్రలో నటించిన పూజా హెగ్డే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. బుట్ట బొమ్మ పాటలో ఈమె చేసిన నాట్యానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. లక్షల మంది విదేశీయులు కూడా ఈ పాటని వీక్షించారు. ఈ ఒక్క పాటతో ఆమె ఎంతో పాపులారిటీ తో పాటు ఎన్నో సినీ అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. అల్లు అర్జున్ సరసన రెండవసారి జతకట్టిన పూజా హెగ్డే కెరీర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో ఆమె స్టార్ డమ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముంబై లో పుట్టి పెరిగిన ఈ తుళు భామ తెలుగు పరిశ్రమలో అగ్ర తారగా ఎదగడం మెచ్చుకోదగ్గ విషయమే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: