టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క అలియాస్ స్వీటీ ... ఆ సినిమాలో తన పాత్రకు మంచి మార్కులు పడటంతో ఇప్పుడు మకుటం లేని మహా రానిలాగా సినీ ఇండస్ట్రీని ఎలుతుంది.. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి ప్రత్యేక స్థానాన్ని అందుకుంది.. సినిమాల మాట పక్కన పెడితే అనుష్క వ్యక్తిత్వం చాలా మంచిదని అందరూ అంటున్నారు.. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ చాలా మందిని అభిమానులుగా మార్చింది..
ఎన్నో చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన అనుష్క బాహుబలి, భాగమతి, రుద్రమ దేవి వంటి భహుముఖ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే ...బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్న మహానటి..ఇది ఇలా ఉండగా అనుష్క సినిమాలలోకి ఎంటర్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి అయింది.
అనుష్క ప్రత్యేకతలు గురించి చెప్పాలంటే మాటలు చాలవు పుస్తకాలు సరిపోవు అందుకే అనుష్క ను గ్రేట్ యాక్టర్ గా పిలుస్తారు . మరి కొందరు మాత్రం దివి నుంచి దిగి వచ్చిన సౌందర్య అని కొనియాడుతూ ఉంటారు.. విభిన్న పాత్రల్లో నటించడం అనుష్క కు సాధ్యం అని చెప్పాలి.. అందుకే సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న కూడా ఆ అణుకువ పద్ధతి ఇప్పటికి ఆమెపై అభిమానాన్ని పెంచుతూ వస్తున్నాయి..
అసలు విషయానికొస్తే.. అనుష్క నిజానికి కన్నడ బ్యూటీ.. అయినా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ విజయాలను అందుకోవడమే కాదు.. తెలుగు భాషను కూడా చక్కగా నేర్చుకొని అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమెకు ఇది మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇకపోతే అనుష్క భాగమతి సినిమా తరువాత సినిమాలకు దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు మరోసారి సినిమాలలో నటించినదానికి రెడీ అయ్యింది. పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకున్న అనుష్క న్యాచురల్ గా ఉన్న సినిమాలలోనే నటిస్తూ వచ్చింది. అభిమానులకు గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది.ఇటీవల నిశ్శబ్దం సినిమాలో నటించింది.