మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. డిస్కో రాజా తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆల్రెడీ గోపిచంద్ డైరక్షన్ లో రవితేజ చేసిన డాన్ శీను, బలుపు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా క్రాక్ వస్తుంది. దాదాపు పూర్తవడానికి వచ్చిన ఈ సినిమా కొద్దిపాటి షూటింగ్ పెండింగ్ ఉందట. అది కూడా పూర్తయితే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందట. అయితే ఈమధ్య మీడియం బడ్జెట్ సినిమాలన్ని ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాయి.

 

అందుకే రవితేజ క్రాక్ సినిమాను కూడా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ ఓటిటి సంస్థ నుండి క్రాక్ కు భారీ ఆఫర్ వచ్చిందట. అందుకే క్రాక్ ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. క్రాక్ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ తోనే ఈసారి హిట్టు పక్కా అనిపించుకునేలా వస్తున్న క్రాక్ ఎలాంటి ఫలితాన్ని అదుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

 

ఆ సినిమాకు ఖిలాడి టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయ్యప్పనుం కోషియం రీమేక్ లో రవితేజ నటిస్తాడని వార్తలు రాగా ఎందుకో ఆ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకోలేదట. హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కే అయ్యప్పనుం కోషియం రీమేక్ లో వెంకటేష్, రానాలనే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. క్రాక్, కిలాడి తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు పూర్తి చేశాక కాని అవి ఫైనల్ అవుతాయని తెలుస్తుంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: