ఇటీవల కాన్పూర్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశంలో హాట్ టాపిక్ గా మారింది.   జూన్‌ 3న కాన్పూర్‌ పోలీసులు హత్య కేసులో వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్తుండగా వారి వాహనానికి దూబే అనుచరులు భూమిని చదును చేసే యంత్రాన్ని అడ్డుపెట్టి వాహనాల చాటు నుంచి‌ పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ డిప్యూటీ ఎస్పీస్థాయి అధికారితోపాటు, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. అప్పటి నుంచి దుబే అనుచరులను ఎన్ కౌంటర్ చేస్తూ వచ్చారు పోలీసులు.

 

ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి యూపికి తరలిస్తున్న సమయంలో కాన్వాయ్ బోల్తా పడటం దుబే తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం జరిగింది.  దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వికాస్ దుబేను హతమార్చడంతో ఆయన వెనకున్న వ్యక్తులు ఎవరో బయటి ప్రపంచానికి తెలియకుండా పోయిందని అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ మొదలగు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.

 

తాజాగా ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ట్వీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో సినిమాల్లో జరిగిన సన్నివేశాలు నమ్మశక్యంగా లేవని అందరూ అంటుంటారు…మరి వాళ్లు ఇప్పుడేమంటారు? అంటూ తాప్సీ ట్వీట్ చేశారు. తాప్సీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు అనుమాలు రేకెత్తుతున్నాయని అంటూ ట్విట్ చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: