హీరో ఓరియెంటెడ్ సిినిమాల్లో హీరోయిన్ టాలెంట్ బయటపడటం కష్టం. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించేందుకు కావాల్సినంత స్కోప్ దొరుకుతుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి కీర్తి సురేష్ కు మంచి నటి అనే ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో డిఫరెంట్ రోల్స్ తో తానేమిటో నిరూపించుకోవాలనుకున్న కీర్తి సురేష్ ను కరోనా అడ్డుకుంది. 

 

మహానటితో కీర్తి సురేష్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ ఉత్తమ నటి అనిపించుకుంది. మహానటితో వచ్చిన రెస్పాన్స్ తో వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నటిగా తానేమిటో నిరూపించుకోవాలనుకున్న డ్రీమ్స్ ను కరోనా చెల్లాచెదురు చేసింది. థియేటర్స్ లోకి సినిమాలు రిలీజ్ కాకుండా.. అడ్డుపడింది. దీంతో ఈ అమ్మడి కష్టమంతా.. ఓటీటీలో పరిమితమై.. వెలుగులోకి రావడం లేదన్న బాధ కీర్తి సురేష్ ను వెంటాడుతోంది. 

 

మహానటి ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. బిజీ అయిపోయింది కీర్తి. పెంగ్విన్ డిజిటల్ రిలీజ్ కు మంచి ఆఫర్ రావడంతో.. అమేజాన్ ప్రైమ్ కు సినిమా రైట్స్ ఇచ్చేశారు నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి కూడా ఓటీటీ వైపు చూస్తున్నాయి. 

 

పెంగ్విన్ నిర్మాతలు ఓటీటీని నమ్ముకోవడంతో.. పెట్టుబడిని మించి నాలుగు కోట్లు అందుకున్నారు. డబ్బింగ్.. శాటిలైట్ రైట్స్ రూపంలో మరో ఐదు కోట్లు.. మొత్తం మీద 10కోట్లు లాభం వచ్చింది. దీంతో మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి నిర్మాతలు కూడా పెంగ్విన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఇక కీర్తి సురేష్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలంటే.. నితిన్ తో నటిస్తున్న రంగ్ దే.. ఇంకా మొదలుకాని.. మహేశ్ సర్కారు వారి పాట రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: