బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా తర్వాత ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరోయిన్ పరిణితి చోప్రా. లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన అమ్మడు ఇషక్జాదే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. శుద్ దేసి రొమాన్స్, హసితో ఫసి సినిమాలతో కూడా అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కెరియర్ లో చేసింది 12 సినిమాలే అయినా పరిణితికి బాలీవుడ్ లో ఓ క్రేజ్ వచ్చింది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించే పరిణితి చోప్రా రొమాన్స్ లో కూడా వెనకడుగు వేయదు.
ఇక లేటెస్ట్ గా అమ్మడు రెడ్ స్విమ్ సూట్ లో ఆడియెన్స్ దిమాక్ ఖరాబ్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఫిగర్ కటౌట్ ఉండే పరిణితి ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డది. లాస్ట్ ఇయర్ రెండు సినిమాల్లో నటించగా రెండు ఆకట్టుకోలేదు. ఈ ఇయర్ లో మూడు సినిమాలు చేస్తున్న అమ్మడు రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఒకటి షూటింగ్ జరగాల్సి ఉందని తెలుస్తుంది. ఫోటో షూట్ అంటే ఎప్పుడు ముందుండే పరిణితి చోప్రా లేటెస్ట్ స్విం సూట్ లో కుర్రాళ్లను తెగ డిస్ట్రబ్ చేస్తుంది.
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. సినిమా ఛాన్సులు వచ్చినా రాకున్నా పరిణితి చోప్రా ఇలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పరిణితి చోప్రా స్విమ్ సూట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో కొద్దిగా వెనక్కి తగ్గిన అమ్మడు సౌత్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుందట. త్వరలో తెరకెక్కే పాన్ ఇండియా సీనిమాలో పరిణితిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.