![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/nagarjuna-damarukam-movie-controversy33e45495-6d1d-46fd-84a6-812bf682182b-415x250.jpg)
టాలీవుడ్ కింగ్ నాగార్జున, వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం `డమరుకం`. యోగా బ్యూటీ అనుష్క ఈ సినిమాలో నాగార్జున సరసన నటించింది. డమరుకం చిత్రం నాగార్జున కెరీర్లోనే మొదటి ఫాంటసీ మూవీ. హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించారు. ఆయన కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ కూడా. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చోటాకె.నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు.
శివుడికీ, మనిషికీ మధ్య సాగే సోషియో ఫాంటసీ కథాంశం. అలాగని భక్తి, ఆధ్యాత్మికం తరహా విషయాలేవీ ఇందులో ఉండవు. పక్కా మాస్ సినిమా అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అనేక గండాలను దాటుకుని రేపు విడుదల అవుతుందని అనుకునేలోపే టైటిల్ విషయంలో పెద్ద వివాదమే చోటుచేసుకుంది. నవీన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నానని.. షూటింగ్ కూడా సగం పూర్తయిందని గొడవ చేశారు. వాస్తవానికి ఫిల్మ్ చాంబర్ రూల్ ప్రకారం ఓ టైటిల్ రజిస్టర్ చేయించి దాన్ని దాన్ని మూడు నెలల్లోపు ఏదైనా సినిమా వాడకపోతే దాన్ని వేరొకరికి ట్రాన్ఫర్ చేస్తారు.
అప్పట్లో దీని గురించి నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ రూల్ ఉన్న మాట వాస్తవమే కానీ తాను నిర్మిస్తున్న చిత్రం 50 శాతం పూర్తయిందని.. అలాంటప్పుడు ఆ టైటిల్‌ని ఎలా వేరొక సినిమాకు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టైటిల్ వివాదం కోర్టు వరకు వెళ్లి.. చివరకు ఎలాగోలా సద్దుమణిగింది. అయితే విచిత్రం ఏంటంటే.. వాయిదాలపై వాయిదాలు వేసుకొంటూ, ఎన్నో అరిష్టాలు దాటుకొంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా హిట్ అవ్వలేకపోయింది.