హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, సంచలనాలకు పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. చిన్నతనంతో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా సినిమా రంగప్రవేశం చేసిన మహేష్, ఆ వయసులోనే అద్భుత నటనతో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమకు ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమా సూపర్ హిట్ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ప్రిన్స్ గా, ఆపై సూపర్ స్టార్ గా ఎన్నో గొప్ప విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ప్రస్తుతం క్రేజ్, ఫ్యాన్స్ బేస్, ఫాలోయింగ్, మార్కెట్ పరంగా ఎంతో పీక్స్ లో ఉన్న మహేష్, తెలుగు తప్ప వేరొక భాషలో సినిమా చేయనప్పటికీ కూడా బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించారు.
మొదట్లో కొంత రిజర్వుడుగా ఉన్న మహేష్ బాబు, రాను రాను అభిమానులు, ప్రేక్షకులతో మమేకం అవుతూ వచ్చారు. ఇక ఇటీవల కొన్నాళ్ల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్న సూపర్ స్టార్, నేడు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో ఏకంగా 10 మిలియన్ల రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఇటీవల ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్లు సంపాదించి అద్భుత రికార్డు సొంతం చేసుకున్న సూపర్ స్టార్, నేడు ఇటు ఫేస్ బుక్ లో కూడా ఈ రికార్డుతో ఈ రెండు సోషల్ మీడియా మాధ్యమాల్లో 10 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ యాక్టర్ గా సంచలన రికార్డు నమోదు చేసారు.
Super star @urstrulyMahesh now have 10 Million followers on #Facebook.#10MillionMAHESHIANS #Superstar #Maheshbabu pic.twitter.com/ZTqrQm1Uic
— Vamsi Shekar (@UrsVamsiShekar) July 13, 2020
ఇటీవల కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో తన కుటుంబసభ్యులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతున్న మహేష్ బాబు, కొన్నాళ్లుగా తన కూతురు, కొడుకులతో కలిసి సరదాగా సందడి చేస్తున్న పలు ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే నేడు మహేష్ ఈ అరుదైన ఫీట్ ని సాధించడంతో పలువురు మహేష్ అభిమానులు దీనిని ఒక ట్రెండ్ గా సెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిగెత్తిస్తున్నారు.....!!
10 MILLION thanks can never sum up the immense gratitude I have! Truly happy to be virtually connected with all of you... Much love🤗 #10MillionStrong pic.twitter.com/xIA8Oa7zdk
— mahesh babu (@urstrulyMahesh) July 3, 2020