టాలీవుడ్ లో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న సూపర్ స్టార్ మహేష్ సర్కారి వారి పాట, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప. ఈ రెండు సినిమాల మీద ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇయర్ సంక్రాంతికి ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడి రెండు సినిమాలు సక్సెస్ అందుకున్నారు. అంతా బాగుంటే మహేష్ సర్కారు వారి పాట, బన్ని పుష్ప సినిమాలు మళ్లీ 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయని ఈ సినిమాలు వచ్చే పొంగల్ కు రిలీజ్ అవడం కష్టమే అని చెప్పొచ్చు. 

 

ఇక సుకుమార్ డైరక్షన్ లో బన్ని హీరోగా వస్తున్న పుష్ప సినిమా ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో హీరో పాత్ర పుష్పరాజ్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మరోపక్క సర్కారు వారి పాట సినిమా కూడా పొలిటికల్ సెటైరికల్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాలో విలన్ గా కూడా సుదీప్, ఉపేంద్ర, అరవింద స్వామిల పేర్లు వినపడుతున్నాయి. అయితే పవర్ ఫుల్ కథలతో వస్తున్న ఈ హీరోల సినిమాల్లో విలన్లు ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

 

భారీ బడ్జెట్ సినిమాలకు విలన్లు కూడా ముందే డిసైడ్ చేస్తారు. కాని ఈ రెండు సినిమాల్లో మాత్రం విలన్స్ ఎవరన్నది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా స్టార్ సినిమాల షూటింగ్స్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. ఈ సినిమాల నుండి అప్డేట్స్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: