హీరో, డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయితే.. వెంటనే హీరోయిన్ ఎవరా అని అడుగుతారు. నెలలు వెయిట్ చేసినా.. హీరోకు జోడి దొరకడం లేదు. తెలుగులో ఒకరిద్దరు లేడీ స్టార్స్ ఉన్నా.. వాళ్ల డేట్స్ దొరకవు. దీంతో ఆడియన్స్ మొహం మొత్తేలా ఆల్ రెడీ జత కట్టిన భామలతోనే ఆడిపాడుతున్నారు మన హీరోలు. తెలుగు ఇండస్ట్రీ కరోనా సంక్షోభాన్ని ఈ  మధ్య ఎదుర్కొంటూ.. హీరోయిన్స్ కొరతను చాలా కాలంగా ఫేస్ చేస్తోంది. 

 

తెలుగు స్టార్ హీరోయిన్స్ ఎవరంటే చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. పూజా హెగ్డే.. రష్మిక.. సమంత.. కాజల్.. తమన్నా.. ఇలా ఎంతమంది ఉన్నా.. ఫామ్ లో ఉంది మాత్రం పూజా.. రష్మికనే. లక్ సక్సెస్ రూపంలో కలిసొచ్చి.. ఛాన్సులు అందుకుంటున్నారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా నటిగా ఇంతవరకూ నిరూపించుకోలేదు. యాక్టింగ్ అదరగొట్టేసి.. సినిమాను తమ భుజాలపై మోసిన దాఖలాలు ఒక్కటీ లేవు.  

 

ఇక సమంత అయితే.. లేడీ ఓరియెంటెడ్ మూవీ మాత్రమే చేస్తూ.. స్టార్స్ కు దూరమైంది. రంగస్థలం తర్వాత పెద్ద హీరోల పక్కన కనిపించలేదు. యు టర్న్ తీసుకొని హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలకే ఇంపార్టెంట్ ఇస్తోంది. రకుల్ ను స్టార్స్ జాబితా నుంచి తొలగించారు. వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ అనిపించుకుంది. దీంతో.. రకుల్ అంటే యంగ్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. 

 

ఇండస్ట్రీని ఓ పదేళ్లు ఊపేసిన కాజల్.. తమన్నా పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. చిరంజీవికి వేరే హీరోయిన్ దొరక్క కాజల్ ను తీసుకుంటున్నాడు. ఖైదీ నంబర్ 150 కోసం లాస్ట్ మినిట్ లో ఆచార్యలో త్రిష హ్యాండ్ ఇస్తే కాజల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక తమన్నా అయితే.. స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటోంది. ఆల్ రెడీ స్టార్స్ అందరితో నటించింది. మళ్లీ మిల్కీ బ్యూటీని రిపీట్ చేసే ఉద్దేశం మన హీరోలకు లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: