ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అనే చెప్పాలి.... పెళ్లిచూపులు సినిమాలో కేవలం విజయ్ దేవరకొండ నటన మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ స్నేహితుడు ప్రియదర్శి డైలాగ్స్ కి కూడా తెలుగు ప్రేక్షకులందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. ఈ సినిమా మొత్తం హాస్యభరితంగా సాగిపోతూనే ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయని డైలాగులు.. నిజ జీవితంలో యువకులు వాడిన డైలాగులే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ప్రతి సన్నివేశం కూడా ఎంతో నాచురల్ గా... సాధారణ యువకుడు జీవితానికి దగ్గరగా ఉంటుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ విషయానికొస్తే... టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేసే సందర్భంలో... నాకు 3000 కావాలి అంటూ విజయ్ దేవరకొండని అడుగుతుంది తన గర్ల్ ఫ్రెండ్.. ఏంది మూడు వేలా... పైసలేమన్న చెట్లకు కాస్తున్నాయానే.. మా ఫ్రెండ్స్ లో హవా ఉంటుందని నిన్ను గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా.. మూడువేల విలువ తెలుసానే నీకు 30 బీర్లే 30 బీర్లు అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయి పోవడమే కాదు..పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది కూడా. అదే సమయంలో ఇదంతా రియాలిటీ కాదని ఇమాజినేషన్ అని చివర్లో తెలియడంతో మరింత నవ్వుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ సన్నివేశం తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పటికీ ఆల్ టైం ఫేవరెట్ గా నిలిచింది అని చెప్పాలి.
Powered by Froala Editor