తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా హీరోలంతా తుపాకీ పడుతున్నారు. శత్రువులను చంపేస్తామని బార్డర్ లో కాపలా కాస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుపెట్టి, విజయపతాకం ఎగురవేయడానికి మిలటరీలో చేరుతున్నారు. జై జవాన్ నినాదంతో కొత్త క్యారెక్టర్ లోకి వెళ్లిపోతున్నారు.
పూరీ జగన్నాథ్ సినిమాలు ఒక పర్టిక్యులర్ మీటర్ లో ఉంటాయి. కమర్షియల్ కోటింగ్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతాయి. హీరో క్యారెక్టరైజేషన్ పక్కా పోకిరిలా ఉంటుంది. అయితే ఇప్పుడీ ఫార్మాట్ ను మార్చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. జనగమణమన సినిమాను మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నాడు పూరీ.
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. చాలా రోజుల క్రితమే ఈ సబ్జెక్ట్ ను డిజైన్ చేసి పెట్టుకున్నాడు పూరీ. ఇక పూరీ కనెక్ట్స్ లో చాలా రోజులుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ సబ్జెక్ట్ ని, పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తున్నాడు. లార్జ్ స్కేల్ లో తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం బిగ్ క్వశ్చన్ గా మారుతోంది.
యునిక్ స్టోరీస్ తో మెప్పించే అడివి శేష్ కూడా తుపాకీ పడుతున్నాడు. 26 బై 11 ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథాంశంలో నటిస్తున్నాడు. మేజర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు.
ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. భారీ వసూళ్లు దక్కుతాయి. ఇక దేశభక్తి కథాంశాలైతే బాక్సాఫీస్ కూడా ఎమోషనల్ గా ఫీలవుతుంది. ఈ టచింగ్ తోనే చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ల ఇన్సిపిరేషన్ తోనే ఇప్పుడు మిలిటరీ కథాంశాలు తెరకెక్కుతున్నాయి.
బాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ కొట్టింది యూరి-ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో 25కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా 300కోట్లకు పైగా వసూలు చేసింది. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో మిలిటరీ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాతో విక్కీ బాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు.
మహేశ్ బాబు సంక్రాంతి మూవీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు. మహేశ్ ఫస్ట్ టైమ్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నటించిన ఈ సినిమా 100కోట్లకు పైగా వసూలు చేసింది. మహేశ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది.
మిలిటరీ మెన్ కు ఎప్పుడూ సెలవు ఉండదు. ఎక్కడున్నా దేశ రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటారనే కథాంశంతో వచ్చి, సూపర్ హిట్ కొట్టింది తుపాకి. మురుగదాస్-విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీకి తమిళ్ తో పాటు, తెలుగులోనూ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇ ఈ మూవీ హిందీలో హాలిడే గా రీమేక్ అయి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.