మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తో స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన “ఓకే బంగారం” సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ మలయాళంలో మంచి క్రేజ్ కలిగిన హీరో. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో టాలీవుడ్ ఇండస్ట్రీలో "మహానటి" సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. దీంతో దుల్కర్ సల్మాన్ ని తెలుగులో హీరోగా పరిచయం చేయాలని హను రాఘవపూడి రెడీ అయ్యాడు. వరుస  ఫ్లాపుల్లో ఉన్న హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ కి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తెలుగు లో నటించడానికి మొత్తం రంగం సిద్ధమైంది.

IHG

హీరోయిన్ గా పూజా హెగ్డేను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది . అంతా బాగానే ఉంది ఇంకా సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అనుకున్న టైమ్ లో కరోనా రావడంతో లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా హను రాఘవపూడి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ సినిమా ప్రాజెక్టు ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

IHG'Andala Rakshasi' director? -

ఎందుకంటే దుల్కర్ చేతినిండా కీలకమైన డైరెక్టర్ల ప్రాజెక్టులు ఉన్నాయట. ఇలాంటి తరుణంలో ఫ్లాప్ డైరెక్టర్ కోసం తన టైం వేస్ట్ చేయకూడదని హను రాఘవపూడి సినిమా నుండి దుల్కర్ సల్మాన్ పక్కకు తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో డైరెక్టర్ హను రాఘవపూడికి బ్యాడ్ టైం నడుస్తుంది అని అందుకే వరుస బ్యాడ్ న్యూస్ లు వింటున్నాడని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగానే సినిమా ఇండస్ట్రీలో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ల కెరియర్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: